గర్భంలో మృతి చెందిందా.. లేక ఆడపిల్ల పుట్టిందని బరువుగా భావించారా తెలియదు కానీ.. ముళ్లకంపల పాలైంది. బొడ్డూడని పసికందు శరీరం ముళ్లకు చిక్కుకుని వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీ బీసీ సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహం స్నానపు గదులకు ఆనుకుని ఉన్న ముళ్ల పొదల్లో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అటువైపు వెళ్తున్న వారు గమనించి గుమికూడారు. పసికందును ఇలా పడేయడానికి మనసెలా వచ్చిందో అంటూ కంటతడి పెట్టారు.
– రాయదుర్గం:


