● 10 మహిళా సంఘాల నుంచి రూ.లక్షలు మింగిన వైనం
శెట్టూరు: మండల పరిధిలోని మాకోడికి గ్రామ యానిమేటర్ విజయ్ కుమార్ చేసిన ఖతర్నాక్ పనులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. సోమవారం మాకోడికి తండాకు చెందిన 10 మహిళా సంఘాల సభ్యులు స్థానిక వెలుగు కార్యాలయం ముట్టడించడంతో బాగోతం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నా యి. మాకోడికి తండాలో 10 మహిళా సంఘాలకు సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. సంఘాల లీడర్లకుగాని, సభ్యులకు గాని విషయం తెలపకుండా రుణాలను యానిమేటర్ విజయ్‌కుమార్ తీసుకున్నాడు. దివ్యా మహిళా సంఘానికి రూ. 4 లక్షలు మంజూరు కాగా, కేవలం రూ. 1.5 లక్షలు ఇచ్చి ఇంతే అని చెప్పా డు. రూ. 1.5 లక్షలు చెల్లించినా పొదుపు ఖాతా నుంచి ప్రతి నెలా కంతు జమవుతూ ఖాతా ఖాళీ కావడంతో అప్రమత్తమైన సభ్యులు బ్యాంక్‌లో వివరాలు అడి గారు. ఇంకా రూ.3లక్షల అప్పు ఉందని చెప్పడంతో కంగుతిన్నారు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ చేసిన మరిన్ని ఖతర్నాక్ పనులు వెలుగులోకి వచ్చాయి.
● లక్ష్మీ మహిళా సంఘానికి సంబంధించి సభ్యుల అనుమతి లేకుండా రూ. 5 లక్షల రుణం తీసుకున్నట్లు తెలిసింది. సరస్వతి సంఘంలో సభ్యులకు తెలియకుండా అదనంగా రూ.లక్ష పొందాడు. మరో 7 సంఘాలకు సంబంధించి రూ. లక్ష, రూ. 2 లక్షల చొప్పున కాజేశాడు. ఈ సొమ్మును బ్యాంక్ వారు పొదుపు ఖాతాల నుంచి జమ చేసుకోవడంతో లబ్ధిదారులు సోమవారం లబో దిబోమంటూ శెట్టూరులోని వెలుగు కార్యాలయం వద్దకు చేరుకుని గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, 100 మందికిపైగా మహిళలు వచ్చి ఫిర్యాదు చేస్తే బాధ్యతగా తీసుకోవాల్సిన ఏపీఎం హుసేన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని సభ్యులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే యానిమేటర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ‘అంతా మావారే సర్దుకుంటాము’ అంటూ చెప్పడం కొసమెరుపు.


