అన్నదమ్ముల సాహస ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

అన్నదమ్ముల సాహస ప్రదర్శన

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

తాడిపత్రిటౌన్‌: గిన్నిస్‌ బుక్‌ రికార్డే లక్ష్యంగా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారులు సాహస ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తైక్వాండోలో శిక్షణ పొందుతున్న సాయి నరసింహారెడ్డి, గౌతమ్‌కుమార్‌రెడ్డి అన్నదమ్ములు. ఆదివారం ఈ పిల్లల స్టంట్‌ ఈవెంట్‌ జరిగింది. కృష్ణాపురం జీరో రోడ్డులో జరిగిన ప్రదర్శనకు సీఐ శివగంగాధర్‌రెడ్డి, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ కో ఆర్డినేటర్‌ ఆనంద్‌ హాజరయ్యారు. గౌతమ్‌కుమార్‌రెడ్డి (విక్కీ) తన కడుపుపై నుంచి 4.6 నిమిషాల్లో వంద బైకులు వెళ్లే స్టంట్‌ చేయగా.. సాయి నరసింహారెడ్డి (లక్కీ) చేతివేళ్లపై 16 నిమిషాల్లో వంద కార్లు పోనిచ్చి భళా అనిపించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement