అనంతపురం కల్చరల్: ఐక్యతతోనే క్రైస్తవుల అభ్యున్నతి సాధ్యమని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) అంతర్జాతీయ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ హనోక్ అన్నారు. ఏఐసీసీ జిల్లా సమావేశం, నూతన కార్యవర్గ ఎంపిక బుధవారం అనంతపురంలోని వాల్మీకి భవన్ వేదికగా సాగింది. ఏఐసీసీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు డాక్టర్ విజయకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ హనోక్, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎలియాజర్ తదితరులు మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సమస్యలపై గళమెత్తి వాటిని పరిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడిగా యేషయ, ఉపాధ్యక్షుడిగా మనుష్యే, గౌరవాధ్యక్షులుగా నెహమ్యా నాగరాజు, అనిల్ మోజెస్, డాక్టర్ ఐజయ్య, రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంటుగా రెవరెండ్ వైపీ బాబు తదితరులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెవరెండ్ రెడ్డివారి నెహమ్యా నాగరాజు, సంఘం నాయకులు జాన్‌వెస్లీ, కమల్, ప్రకాష్, జానీ, స్వామిదాసు, చల్లా కిషోర్, జేమ్స్ పాల్‌నాయక్, బాలాస్వామి, వినోద్, అరుణగ్రేస్, రవికుమార్, జాషువా, జహంగీర్, మార్కు, విజయసింహ, థామస్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ అంతర్జాతీయ అధ్యక్షుడు
డాక్టర్ హనోక్


