ఏపీటీఎఫ్‌ 1938 జిల్లా నూతన కమిటీ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ 1938 జిల్లా నూతన కమిటీ ఎంపిక

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (1938) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బుధవారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. రవీంద్ర, ప్రధాన కార్యదర్శిగా బి.హనుమప్ప, గౌరవాధ్యక్షుడిగా అశోక్‌ నాయక్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా హనుమంతు నాయక్‌, అదనపు కార్యదర్శిగా పోతులయ్య, ఉపాధ్యక్షులుగా వజీర్‌ బాషా, బహేశ్వర, నాగరాజు, సాయినాథరెడ్డి, కార్యదర్శులుగా హనుమంతు, దామోదర్‌, రామాంజనేయులు, మల్లినాథ్‌, ఫకృద్దీన్‌, కాంతిరాజ్‌తో పాటు 24 మంది రాష్ట్ర కౌన్సిలర్లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాధవ స్వామి, పరిశీలకులుగా కడప జిల్లా ప్రధానకార్యదర్శి అబ్దుల్లా వ్యవహరించారు. సమావేశంలో రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.కులశేఖరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ రఫీ, ఐఫియా కమిటీ సభ్యులు సత్యప్రసాద్‌, మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు, సబ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement