శెట్టూరు: జనాభా గణనను పాదర్శకంగా చేపట్టాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. బుధవారం శెట్టూరు మండలం కై రేవు గ్రామంలో చేపట్టిన జనగణనను ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈశ్వరమ్మ, సచివాలయ ఉద్యోగులు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
రీ సర్వేలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
ప్రస్తుతం చేపట్టిన రీ సర్వే పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారులను జేసీ హెచ్చరించారు. బుధవారం కై రేవు, లక్ష్మంపల్లి గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. రీ సర్వే పనుల తీరుపై ఆరా తీశారు. అనంతరం కై రేవు లోని స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని పరిశీలించారు. లక్ష్మంపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


