ముగిసిన ఇంటర్‌ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ మూల్యాంకనం

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మూల్యంకనం విజయవంతం కావడంతో ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్‌ను ఉద్యోగ సంఘాల నాయకులు అభినందించారు. ఆయనను కలిసి పూలబొకే అందజేశారు. జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారన్నారు. అలాగే మూల్యాంకనంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలూ పకడ్బందీగా చేపట్టారన్నారు. అందరి సహకారంతో గడువులోగా క్యాంపు పూర్తి చేశారన్నారు. ఆర్‌ఐఓను కలిసిన వారిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం (జీజేఎల్‌ఏ) జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, కార్మదర్శి షణ్ముకాచారి, ట్రెజరర్‌ బి.పెద్దన్న, ఉపాధ్యక్షులు యు.వీరాంజనేయులు, జాయింట్‌ సెక్రటరీ జయరామ్‌నాయక్‌, ఫయాజ్‌బాషా, వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటరంగయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement