రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మహిళలకు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హోం మంత్రి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడానికే సమయమంతా వెచ్చిస్తున్నారు. అమ్మాయిల మిస్సింగ్ అయ్యారంటూ గగ్గోలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వారందరినీ ఎప్పుడు వెతికి తీసుకొస్తారో ప్రజలకు చెప్పాలి. వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ వంటి వారికి గట్టిగా గుణపాఠం చెప్పాలి.
– విజయ మనోహరి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్


