
మహాత్ముని కల సాకారం చేసిన జగన్
అనంతపురం కార్పొరేషన్: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌బహుదూర్ శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ శాంతి, అహింస అనే ఆయుధాలతో గాంధీజీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. గాంధీజీ ఆశయ సాధన కోసం అందరూ కలసికట్టుగా ముందుకెళ్దామన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి 1,25,000 మందికిపైగా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు సచివాలయల ద్వారా ఇంటి వద్దకే సుపరిపాలన అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి దేశానికి ఎన్నో సేవలందించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థ నాయక్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, రాష్ట్ర నాయకులు వెన్నం శివరామిరెడ్డి, మదిరెడ్డి నరేంద్రరెడ్డి, వేమల నదీం, కృష్ణవేణి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, సైఫుల్లాబేగ్, నాయకులు మీసాల రంగన్న, అనిల్‌కుమార్‌గౌడ్, రహంతుల్లా, జావేద్, కై లాస్, రాధాకృష్ణ, ఎంఎస్‌ఎస్ సాదిక్, వెన్నపూస రామచంద్రారెడ్డి, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, పసలూరు ఓబులేసు, ఉష, తదితరులు పాల్గొన్నారు.
గాంధీ జయంతి వేడుకల్లో
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత