
విదేశాలకు చీనీ ఎగుమతులపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం మార్కెట్ నుంచి విదేశాలకు చీనీ ఎగుమతులు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉన్న చీనీ మార్కెట్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ–నామ్ పద్ధతిలో చీనీ క్రయ విక్రయాల గురించి ఆరా తీశారు. అలాగే ఏటా మార్కెట్‌కు వస్తున్న చీనీకాయలు, పలుకుతున్న ధరలు, రైతులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాల గురించి మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్, గ్రేడ్–2 సెక్రటరీ రూప్‌కుమార్, అలాగే ట్రేడర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి కనీసం 200 టన్నులు చీనీకాయలు విదేశాలకు ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటే రైతులకు మరింత గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉంటుందన్నారు.
‘అమృత్’ పనులు పూర్తి చేయాలి
అనంతపురం అర్బన్: ‘అమృత్’ పథకం కింద నగరపాలక సంస్థతో పాటు పురపాలక సంఘాల్లో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రజారోగ్య, నగర పాలక, టిడ్కో అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 1.0 కింద రూ.15.35 కోట్లతో చేపట్టిన అనంతపురం వాటర్ సప్లయ్ ఇంప్రూవ్‌మెంట్ స్కీమ్ పనులు, ట్రయల్ రన్ చేపట్టాలని ఆదేశించారు. పథకం కింద గుంతకల్లు పట్టణంలో రూ.10.98 కోట్లతో చేపట్టిన పనులు పూర్తిచేసి ఈ నెలాఖరుకు ట్రయల్ రన్ చేపట్టాలన్నారు. తాడిపత్రిలో పనులు వారంలోగా పూర్తి చేయాలన్నారు. అనంతపురం, గుంతకల్లులో సీపేజ్ అండ్ సెప్టేజ్ నిర్వహణ పనులను, ఇతర మునిసిపాలిటీల్లో చేపట్టిన ఇతర ప్రధాన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఏపీ టిడ్కో కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటికి సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
301 చెరువులను నింపాలి
జిల్లాలో భూగర్భజలాలు పెరగాలంటే 301 చెరువులను నీటితో నింపాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నీటి వనరులు, భూగర్భజలాల పెంపు, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, మైనర్ ఇరిగేషన్ శాఖల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమీక్షించారు.