
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో విద్యుదాఘాతంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తజిబుల్ (34) అనే కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌లోని మధ్యపార గ్రామానికి చెందిన తజిబుల్ పని నిమిత్తం కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి వచ్చాడు. అయితే శనివారం సాయంత్రంవిద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా స్తంభంపైకి ఎక్కిన తజిబుల్ షాక్‌కు గురై కిందపడ్డాడు. వెంటనే స్థానిక సిబ్బంది కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే తజిబుల్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. మరణ వార్తను కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు కంబదూరు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్‌కు బదులు మరొక లైన్‌కు ఎల్‌సీ ఇవ్వడం వల్లే కార్మికుడు షాక్‌కు గురై చనిపోయినట్లు తెలుస్తోంది.
ఆటోడ్రైవర్లకు చేయూత
బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ సేవలో..’ పథకం కింద ఆటోడ్రైవర్లకు చేయూత అందించిందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పథకం కింద జిల్లాలో 9,275 మంది డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.13,91,25,000 మంజూరైంది. ఇందుకు సంబంధించిన మెగా చెక్కును శనివారం బుక్కరాయసముద్రంలో కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ జెండా ఊపి ఆటో ర్యాలీతో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ శ్రీధర్‌మూర్తి, ఎంపీడీఓ సాల్మాన్, డిస్టిక్ మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్ శ్రీదేవి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి