
‘ధన’లక్ష్మీ నమోస్తుతే
శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు
పోటెత్తుతున్నారు. ఏడో రోజైన ఆదివారం జగన్మాత వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాయదుర్గంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని
రూ. కోటి విలువైన కరెన్సీ నోట్లు, కాయిన్లతో అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు
తాయి రాజశేఖర్, యువజన సంఘం
అధ్యక్షుడు వంశీకృష్ణ, ప్రధాన అర్చకులు వెంకటాచలశర్మ అలంకరణలో పాలుపంచుకోగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
– రాయదుర్గంటౌన్: