
బాలకృష్ణా.. పొగరు తగ్గించుకో
● నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం
● మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి
గుంతకల్లు టౌన్: అసెంబ్లీ సాక్షిగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. బాలకృష్ణ పొగరు తగ్గించుకోవాలని హితవు పలికారు. తప్పతాగి మరోసారి వైఎస్.జగన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాల్పుల కేసులో బాలకృష్ణను దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి మానవత్వంతో కాపాడకపోయి ఉంటే జైల్లో ఊచలు లెక్కపెట్టేవారని గుర్తు చేశారు. బాలకృష్ణ చేష్టలను ఆయన అభిమానులు భరిస్తారేమో కానీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని స్పష్టం చేశారు.