
వైఎస్సార్‌సీపీ నాయకులకు 41ఏ నోటీసుల జారీ
చెన్నేకొత్తపల్లి: రాప్తాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు, వెంకటేష్‌కు చెన్నేకొత్తపల్లి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరు గత నెలలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీకి చెందిన ఫణీంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురినీ ఎస్‌ఐ సత్యనారాయణ శనివారం స్టేషన్‌కు పిలిపించి, కౌన్సెలింగ్ చేసి.. 41ఏ నోటీసులు అందజేశారు.
13న బీఎస్‌ఎన్‌ఎల్
లోక్ అదాలత్
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్ పాషా శనివారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల్లో నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్/ఎఫ్‌టీటీహెచ్ ఫోన్ల వినియోగదారులు తమ బకాయిలను రాయితీపై చెల్లించే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. క్లోజ్ చేసిన ఫోన్లకు సంబంధించిన వినియోగదారులకు న్యాయ సేవాధికార సంస్థల ద్వారా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అటువంటి వారు లోక్ అదాలత్‌కు ముందే బకాయిలు చెల్లిస్తే లోక్ అదాలత్‌కు హాజరు కావాల్సిన అవసరం ఉండదన్నారు.