9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా

Sep 7 2025 8:00 AM | Updated on Sep 7 2025 8:02 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఫార్మా రంగంలో శిక్షణ, ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 9న అనంతపురం ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో అడ్మిషన్‌, ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న యువతీ యువకులకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, విజయవాడలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి సదుపాయం ఉంటుందన్నారు. ఫార్మా సెక్టార్‌ స్కిల్స్‌పై నైపుణ్యతతో కూడిన శిక్షణ, వివిధ ఫార్మాకంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 2023, 2024, 2025లో బీఎస్సీ లేదా ఎంఎస్సీ (బీజెడ్‌సీ) కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఎలెక్ట్రానిక్స్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బీ–ఫార్మా లేదా డీ ఫార్మా లేదా ఎం ఫార్మా, బీఎస్సీ లేదా ఎంఎస్సీ (మైక్రోబయాలజీ), బీఈ లేదా బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 9న బయోడేటాతో మేళాకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎకాలజీ కార్యాలయం లేదా 81217 17846 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

మూడో విడతలో ముగ్గురు అభ్యర్థులు

నేడు సర్టిఫికెట్ల పరిశీలన

అనంతపురం ఎడ్యుకేషన్‌: డీఎస్సీ–25లో మూడో విడతలో మరో ముగ్గురు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ముగ్గురి జాబితా శనివారం రాత్రి డీఈఓ కార్యాలయానికి అందింది. అభ్యర్థులకు మెసేజ్‌లు వెళ్లాయి. ఆదివారం ఉదయం డీఈఓ కార్యాలయంలో వారికి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. ఇదిలాఉండగా జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటిదాకా రెండు విడతల్లో 757 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు అందాయి. వారందరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. తాజాగా ముగ్గురి పేర్లు రావడంతో మొత్తం 760 మందికి కాల్‌లెటర్లు అందాయి. తక్కిన అభ్యర్థుల పరిస్థితిపై జిల్లా అధికారులకే స్పష్టత లేదు. ఇంతటితో ఆగిపోతుందా? ఇంకా ఎవరికై నా కాల్‌లెటర్లు వస్తాయా? అనేది అర్థంకాక అటు అధికారులు, ఇటు అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు.

భూ సమస్య పరిష్కారానికి చర్యలు

అనంతపురం అర్బన్‌: పేద దళితుడు జి.కుళ్లాయిస్వామి భూమి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు గ్రామానికి చెందిన జి.కుళ్లాయిస్వామి భూమి సమస్య గురించి ఈనెల 1న ‘సాక్షి’లో కథనం ప్రచురితమయ్యింది. దీనిపై అనంతపురం రూరల్‌ తహసీల్దారు మోహన్‌కుమార్‌ క్షేత్రస్థాయికి వెళ్లి బాధితుడు కుళ్లాయిస్వామి సమక్షంలో విచారణ చేశారు. కుళ్లాయిస్వామికి చెందిన భూమిని సాగు చేస్తున్న వారితో మాట్లాడారు. రికార్డు ప్రకారం సర్వే నంబరు 334–17లోని ఎకరా భూమి కుళ్లాయిస్వామికి చెందుతుందని, వెంటనే దాన్ని అప్పగించాలని చెప్పారు. త్వరలో సర్వే చేయించి హద్దులు నిర్ణయించి భూమిని స్వాధీనం చేస్తామని తహసీల్దారు హామీ ఇచ్చారని బాధితుడు కుళ్లాయిస్వామి తెలిపాడు.

మనల్‌ చౌహాన్‌ అద్భుత సెంచరీ

అనంతపురం: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–19 ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ ఆర్డీటీ మైదానంలో కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఆంధ్రా సెక్రెటరీ, మధ్యప్రదేశ్‌ జట్లు విజయం సాధించాయి.

● మధ్యప్రదేశ్‌, ఆంధ్రా ప్రెసిడెంట్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన ఆంధ్రా ప్రెసిడెంట్‌ జట్టు తొలుత ఫీల్డింగ్‌ ఎంపిక చేసుకుంది. మధ్యప్రదేశ్‌ జట్టు 48.2 ఓవర్లలో 283 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. మనాల్‌ చౌహాన్‌ అద్భుత సెంచరీ (94 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 126 పరుగులు) సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రా ప్రెసిడెంట్‌ జట్టు 31.3 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. మధ్యప్రదేశ్‌ జట్టు 138 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

● ఆంధ్రా సెక్రెటరీ, బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత ఆంధ్రా సెక్రెటరీ బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్రా సెక్రెటరీ జట్టు నిర్ధేశించింది. జి.మన్విత్‌రెడ్డి 82 పరుగులు (77 బంతుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్లు), రక్షణ్‌ 64 బంతుల్లో 57 పరుగులు (5 ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బరోడా జట్టు 40.5 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో ఆంధ్రా సెక్రెటరీ జట్టు 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా 1
1/3

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా 2
2/3

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా 3
3/3

9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్‌ మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement