
‘అనంత’ వాసులకు పురస్కారాలు
అనంతపురం కల్చరల్: అనంతపురానికి చెందిన పలువురు జాతీయస్థాయి పురస్కారాలను అందుకున్నారు. ఐదు దశాబ్దాలుగా కళాకారుల సేవలను గుర్తిస్తూ వారికి గౌరవ సత్కారాలనందిస్తున్న బళ్లారి కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ వారు 53వ వార్షికోత్సవ వేడుకలు శనివారం బళ్లారిలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా జిల్లావాసులు జనప్రియకవి ఏలూరు యంగన్న, పద్యకవి ఒంటెద్దు రామలింగారెడ్డిలకు జోళదరాశి చంద్రశేఖరరెడ్డి పురస్కారం, రఘునాథ్‌కు విశ్వావసు ఉగాది పురస్కారం, ‘అనంత’ రంగస్థలానికి చిరస్మరణీయ సేవలందిస్తున్న రామగోవిందసాగర్, సాధుశేఖర్‌కు బళ్లారి రాఘవ స్మారక అవార్డులను నిర్వాహకులు డాక్టర్ బ్రహ్మయ్య, యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి తదితరులు అందించి సత్కరించారు. జాతీయ అవార్డులను అందుకున్న అనంత కళాకారులకు లలితకళాపరిషత్తు కార్యదర్శి గాజుల పద్మజ, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.

‘అనంత’ వాసులకు పురస్కారాలు