
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్
రాప్తాడు: యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం ఆయన రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి రోడ్‌లో ఉన్న మార్క్‌ఫెడ్ గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంత యూరియా వచ్చింది.. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లకు ఎంత పంపించారు తదితర వివరాలను గోడౌన్ సిబ్బందితో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఏఐడీ యాప్ ద్వారా యూరియా సరఫరా సజావుగా చేపట్టాలన్నారు. యూరియా కొనుగోలులో సమస్యలు ఉన్నట్లయితే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. గోడౌన్‌కు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో 500 మెట్రిక్ టన్నులు వస్తోందన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, గోడౌన్ మేనేజర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల విషయంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ
అనంతపురం అర్బన్: ఎరువులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఎరువుల కొరత, అధిక ధరలకు విక్రయం, అక్రమ రవాణా, పంపిణీలో అవకతవకలు తదితర ఫిర్యాదులనుకమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992 నంబరుకు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ సూచించారు.