మే 20న ఎల్‌ఐసీ ఉద్యోగుల సమ్మె
● అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సతీష్
అనంతపురం అగ్రికల్చర్: ఎల్‌ఐసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల మే 20న సమ్మెలోకి వెళుతున్నట్లు ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.సతీష్ తెలిపారు. శనివారం స్థానిక బళ్లారిరోడ్డులో ఉన్న ఎల్‌ఐసీ బ్రాంచి–2 కార్యాలయంలో డివిజన్ ఉపాధ్యక్షుడు సూరిబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో సతీష్ హాజరై మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఎల్‌ఐసీని బలహీన పరిచే కుట్ర జరుగుతోందన్నారు. ఎల్‌ఐసీలోకి విదేశీ పెట్టుబడులు వద్దని డిమాండ్ చేశారు. అందరికీ పెన్షన్, పెన్షన్ అప్డేషన్, స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలవెన్సుల పట్ల విపక్ష చూపుతున్నారని, నూతన రిక్రూమెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలన్నారు. అనేక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మే 20న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ నాయకులు ఎ.రఘునాథరెడ్డి, అక్బర్‌బాషా, శ్రీనివాసులు, నాగరాజు, మధుసూదన్‌రెడ్డి, గాయిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.


