బీసీలకు
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేయడంతో చంద్రబాబు కపట ప్రేమ మరోసారి తేటతెల్లమైంది. ‘మేం 34 శాతం ఇవ్వాలనే అనుకున్నాం.. కానీ కోర్టులే కొట్టేశాయి’ అని సానుభూతి పొందుతూ చేతులు దులిపేసుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామా ఆడారని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. చట్టబద్ధత లేని జీవోలు ఇచ్చి, అవి వీగిపోయాక న్యాయస్థానాలపై నెపాన్ని నెట్టేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, ఇది అక్షరాలా బీసీలకు తీరని ద్రోహం చేయడమేనని ప్రతిపక్షాలు, సామాజికవర్గ ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు.
బీసీల ముందు మొసలి కన్నీరు
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఉన్నాయని తెలిసీ చంద్రబాబు ఈ నాటకానికి తెరతీశారు. చట్టపరంగా నిలబడవని తెలిసినా, ఎన్నికల ముందు బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకే హడావుడిగా రెండు జీవోలు (జీవో నెం: 105, 106) జారీ చేశారు. కోర్టు ఆ జీవోలను కొట్టివేయగానే బీసీల ముందు మొసలి కన్నీరు కార్చాలన్నదే కూటమి ప్రభుత్వ పక్కా వ్యూహమని స్పష్టమవుతోంది.
నాడు బీసీలకు అగ్రపీఠం
సరిగ్గా ఇదే పరిస్థితి 2021 స్థానిక ఎన్నికల సమయంలో ఎదురైనప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుకూ, నేడు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలకు నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా కనిపిస్తోంది. అప్పట్లో వైఎస్ జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తే, టీడీపీ తెరవెనుక శక్తులు కోర్టుకు వెళ్లి దాన్ని నిలిపివేయించాయి. దాంతో రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. అయితే వైఎస్ జగన్ కోర్టు తీర్పును సాకుగా చూపి వదిలేయలేదు. ఆ కోత పడిన 10 శాతం లోటును వైఎస్సార్‌సీపీ సొంత కేటాయింపుల (బీ–ఫారాల) ద్వారా భర్తీ చేసి బీసీలకు అగ్రపీఠం వేశారు.
జీవీఎంసీ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం
2021 విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 98 వార్డులు ఉంటే, వైఎస్సార్‌సీపీ ఏకంగా 65 వార్డులను బీసీలకే కేటాయించి చరిత్ర సృష్టించింది. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సింది 33 సీట్లే అయినా, వైఎస్ జగన్ తన సొంత కోటాలో అదనంగా మరొక 32 సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు.
కూటమిది రాజకీయ నాటకం
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కూటమి జారీ చేసిన జీవోను కోర్టు కొట్టేవేయడం ప్రభుత్వానికి చెంప పెట్టు. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు అడుతున్న రిజర్వేషన్ల డ్రామా బయటపడింది.
– సుర్ల చంద్రశేఖర్,
బీసీ నాయకుడు, నర్సీపట్నం
పార్టీ తరఫున వైఎస్ జగన్ బీసీలకు ప్రాధాన్యం
రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు మించరాదని కోర్టు చెప్పడంతో వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీ తరఫున బీసీలకు అవకాశాలు కల్పించారు. చంద్రబాబుకు ఈ విషయం తెలిసినా బీసీలను మోసం చేయాలని ప్రయత్నించారు.
– కర్రి రుద్రినాయుడు, జిల్లా బీసీ సంఘాల నాయకుడు, అనకాపల్లి
కపట ప్రేమను
గమనిస్తున్నారు..
చంద్రబాబు కపట ప్రేమను బీసీలు గమ నిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే జీవోలను తెచ్చి కోర్టుకు వెళ్లారు. వైఎస్సార్‌సీపీని అభాసుపాలు చేయాలని ప్రయ త్నించి చివరకు ఆయనే బోర్లాపడ్డారు.
– దోమాడ సుందరరావు, బీసీ
నాయకుడు, పాయకరావుపేట
బీసీలపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమే
బీసీలను ఓటు బ్యాంకు గా చంద్రబాబు చూస్తు న్నారు. అమలు సాధ్యం కాని 34 శాతం రిజర్వేషన్ల జీవోను తెరమీదకు తెచ్చారు. బీసీలపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ. రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ధి లేదు. అంతా ఎన్నికల స్టంట్ మాత్రమే. – జి.గోవిందరావు,
బీసీ నాయకుడు, నక్కపల్లి
సుప్రీం తీర్పు బాబుకు చెంప దెబ్బ
బీసీలకు 34 శాతం రిజ ర్వేషన్లపై సుప్రీం తీర్పు బాబుకు చెంప దెబ్బలాంటిది. కోర్టు నిరాకరిస్తుందని తెలిసే జీవోలు ఇచ్చి నాటకమాడారు. ఇది బీసీలను మోసం చేయడమే. బీసీ రిజర్వేషన్లపై కూటమికి చిత్తశుద్ధి లేదు. – గొర్ల నర్సింహమూర్తి, వైఎస్సార్‌సీపీ
బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు
50 శాతం పరిమితి దాటుతుందని
తెలిసీ రిజర్వేషన్ల జీవోలు
న్యాయస్థానాల్లో నిలవని హామీలతో
బీసీలను మభ్యపెట్టే యత్నం
నాడు 65 శాతానికి పైగా పదవులిచ్చి
అండగా నిలిచిన వైఎస్ జగన్
కూటమి నయవంచనపై క్షేత్రస్థాయిలో
రగులుతున్న బీసీలు


