ప్రజలను మభ్యపెట్టేందుకే రిజర్వేషన్‌ డ్రామాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మభ్యపెట్టేందుకే రిజర్వేషన్‌ డ్రామాలు

Oct 10 2026 12:52 AM | Updated on Oct 10 2026 12:52 AM

● రాజకీయ పబ్బం గడుపుకునేందుకే చంద్రబాబు కుతంత్రాలు

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

మునగపాక: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ విమర్శించారు. రిజర్వేషన్లు అమలు కావని తెలిసినా రాజకీ య పబ్బం గడుపుకునేందుకు కుతంత్రాలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ చంద్రబాబు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వెనుక చంద్రబాబు అసలు ఉద్దేశం బయటపడిందన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేవారని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.

హామీలు అమలులో విఫలం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యా రని ప్రసాద్‌ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రిజర్వేషన్ల పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందారని, మళ్లీ వైఎస్‌ జగన్‌ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటారన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని భావించిన చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు గుణపాఠమని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement