‘స్థానిక’ పోరుకు సై | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పోరుకు సై

Oct 10 2026 12:52 AM | Updated on Oct 10 2026 12:52 AM

● జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు

● బ్యాలెట్‌ బాక్సులకు మరమ్మతులు, ఓటర్ల జాబితాల సిద్ధం

నక్కపల్లి: స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై కసరత్తు వేగవంతమైంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలు, వార్డుల వారీగా ఓటర్ల వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేశారు. తుది జాబితాలను ఆయా పంచాయతీ కార్యాలయాలతోపాటు మండల పరిషత్‌, రెవెన్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. పంచాయతీల్లో వార్డుల సంఖ్య, కులాల వారీగా ఓటర్ల వివరాలను సిద్ధం చేశారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో జరిగే అవకాశాలుండటంతో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వాటిని శుభ్రం చేయడంతోపాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు.

స్థానాలకు రిజర్వేషన్ల ఖరారుకు సన్నాహాలు వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీ సెగ్మెంట్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడితే రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అవకాశముంది. జిల్లాలో 24 మండలాలు ఉండగా, ఆయా మండలాల పరిధిలోని పంచాయతీలు, ఎంపీటీసీ సెగ్మెంట్లతోపాటు యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి.

జిల్లాలో ఎన్నికల జరగనున్న స్థానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement