‘అగ్రిసెట్‌’లో వ్యవసాయపాలిటెక్నిక్‌ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

‘అగ్రిసెట్‌’లో వ్యవసాయపాలిటెక్నిక్‌ విద్యార్థుల ప్రతిభ

Oct 10 2026 12:52 AM | Updated on Oct 10 2026 12:52 AM

అనకాపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన అగ్రిసెట్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనకాపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్‌కు చెందిన విద్యార్థులు పలు ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.ముకుందరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.చారుమతి తెలిపారు. ర్యాంకులు సాధించిన వారిలో వేగి హారిక వరలక్ష్మీ 7వ ర్యాంకు, మజ్జి కావ్య 11, పినిశెట్టి కొండమ్మ 14, సోమిరెడ్డి రేవతి 21, పరవాడ కిరణ్‌ 22, కొండిశెట్టి సత్యశ్రీ 25, యండపల్లి తేజ 26వ ర్యాంకు సాధించారు. పేడాడ శ్రావ్య 34వ ర్యాంకు, మద్దు శ్రీవల్లి 39, ఉప్పలపు నవ్యభావన 40, దత్తి ఆశ్రిత 41, దీపక్‌ 43, పి.పావనిసాయి దుర్గా 62, ఎస్‌.సునందిని 64వ ర్యాంకు సాధించినట్లు వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement