19 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతన్లాలేవు.. | - | Sakshi
Sakshi News home page

19 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతన్లాలేవు..

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● కలెక్టరేట్‌ వద్ద ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఆందోళన

తుమ్మపాల : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ఏపి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, సీఐటీయు ఆధ్వర్యంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆందోళన చేసి జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షులు వి.వి.శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి గనిశెట్టి సత్యనారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యూనియన్‌ నాయకులు కె.సూర్యనారాయణ, గోవిందు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో గత 19 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కేవలం రూ.5,745 వేతనంతో బతుకుతున్నారని ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించిన తమకు కనీస వేతనాలు అమలు చేయడకుండా తాత్సారం చేస్తున్నాయన్నారు. తమకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలని, ఫీల్డ్‌ అసిస్టెంట్లపై రాజకీయ జోక్యం పెరిగి తొలగింపులకు పాల్పడుతున్నారని, ఎటువంటి ఉద్యోగ భద్రతా లేకపోవడంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు గత రెండున్నర సంవత్సరాలుగా ఎటువంటి న్యాయం జరగకపోగా, పెద్ద ఎత్తున అన్యాయంగా అక్రమ తొలగింపులకు పాల్పడ్డారని, ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేక కొంత మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారని అన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామనిహెచ్చరించారు. ఈ నిరసన అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement