పోలీస్‌ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

అనకాపల్లి : పోలీస్‌ సిబ్బంది, హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో ఎదురయ్యే భారీ వైద్య ఖర్చుల భారం నుంచి కుటుంబాలకు పూర్తిరక్షణ కల్పించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌, సంక్షేమ పథకాలు, వివిధ బ్యాంకు ప్రతినిధులతో అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు, పోలీస్‌ శాలరీ ప్యాకేజీ ఆధారంగా ఈ కార్యక్రమన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పోలీస్‌ కుటుంబాల ఆరోగ్య భధ్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య చికిత్సల వ్యయం భారీగా పెరిగినందున, అదనపు రక్షణ అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ బ్యాంకులు అందిస్తున్న ఆరోగ్య బీమా, టాప్‌–అప్‌ పాలసీలు ఉద్యోగుల కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ఆటల్‌ పెన్షన్‌ యోజన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ బ్యాంక్‌ మేనేజర్లు ప్రతినిధులు మాట్లాడుతూ శాలరీ ప్యాకేజీ ద్వారా లభించే హెల్త్‌ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్లు, తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ, క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ నెట్‌వర్కు ఆస్పత్రుల వివ రాలు, టాప్‌–అప్‌ ప్లాన్ల వివరాలను వివరించారు. డీఎస్పీలు బాబ్జీరావు, రవికుమార్‌, సీఐలు రామకృష్ణారావు, టి.లక్ష్మి, శ్రీనివాసరావు, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement