హరిదాసులను కళాకారులుగా గుర్తించండి | - | Sakshi
Sakshi News home page

హరిదాసులను కళాకారులుగా గుర్తించండి

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

కశింకోట : హరిదాసులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని జై శ్రీమన్నారాయణ జిల్లా హరి దాసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మైచర్ల అప్పారావు కోరారు. మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద జిల్లా స్థాయి హరి దాసుల సంక్షేమ సంఘం సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు నాలుగు దశాబ్దాలుగా దాసరి కులస్తులు హరిదాసు వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారన్నారు. జిల్లాలోని 9 మండలాల్లో హరి దాసులున్నప్పటికి ప్రభుత్వం నుంచి గుర్తింపు, ఆదరణ లేదన్నారు. హరి నామ స్మరణ చేస్తూ ప్రజల సుఖ సంతోషాలను ఆకాంక్షిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నామన్నారు. అడుగంటిపోతున్న హరిదాసుల వృత్తిని పరి రక్షిస్తూ ప్రభుత్వం తమను కళాకారులుగా గుర్తించాలన్నారు. గుర్తింపు కార్డులు మంజూరు చేసి, సంక్షేమ పథకాలను అందించాలని, సమావేశాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజ హితాన్ని కోరుకునే హరిదాసు వృత్తి అంతరించిపోకుండా తమ పిల్లలు, భవిష్యత్‌ తరాలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించేలా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా సంఘం గౌరవాధ్యక్షుడు కోట్ల భీమరాజు, కార్యదర్శి కందుల నూకరాజు, కోశాధికారి మైచర్ల అప్పారావు తదితరులు మాట్లాడారు. జిల్లాలో సుమారు 104 మంది హరిదాసులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement