ఉద్యోగులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జూలై నెల జీతాల్లో కోత విధించడం అన్యాయం. తగ్గించిన వేతన సొమ్మును వెంటనే చెల్లించాలి. 35 ఏళ్లగా విధులు నిర్వహిస్తున్నాం. కొంతమంది పదవీ విరమణకు సమీపంలో ఉన్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో విలీనం ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగకముందే నిబంధనలకు విరుద్ధంగా జీతాలు ఎలా కట్ చేస్తారు. 2014లో ఆర్‌ఈసీఎస్ బోర్డు 229 మందిని రెగ్యులర్ చేయాలని తీర్మానం చేసింది. ఆ బోర్డు తీర్మానాన్ని ఈపీడీసీఎల్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు. – సిద్ధా గోవిందరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.


