పెళ్లింట విషాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Jul 4 2026 2:37 AM | Updated on Jul 4 2026 2:37 AM

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

నక్కపల్లి: సీహెచ్‌బీ అగ్రహారంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.తన సోద రుడి కుమారుడు వివాహానికి సంబంధించి జరుగు తున్న ఏర్పాట్లలో వి ద్యుత్‌ షాక్‌కు గురై ఓ వ్యక్తిమరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కల్లూరి అప్పలరాజు(52)హెటెరో కంపెనీలో కా ర్మికుడిగా పనిచేస్తున్నాడు. తన సోదరుడి కుమారుడికి రెండు రోజుల్లో వివాహం జరగనుంది. ఇంటి వద్ద విద్యుత్‌లైటింగ్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. శుక్రవారం లైటింగ్‌కు వైరు లాగుతు న్న సమయంలో స్పల్పంగా వర్షంపడింది. వైరుపై అప్పలరాజు కాలు వేయడంతో విద్యుత్‌ షాక్‌ తగిలి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు నక్కపల్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రవీకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement