రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం సహించేది లేదు

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

● కలెక్టరు విజయకృష్ణన్‌

మాడుగుల: అర్హత ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జరిగితే సహించేది లేదని కలెక్టరు విజయ కృష్ణన్‌ హెచ్చరించారు. ఒక నెల ఒక నియోజకర్గంలో నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా స్థానిక పీఆర్‌ వసతి భవనంలో శుక్రవారం ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఉపయోగపడాలని, తప్పులు దొర్లకుండా జాగ్రతలు తీసుకోవాలని, నాలుగు మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జమ్మాదేవి పేట ఎస్సీ కాలనీలో వాటర్‌ ట్యాంకు నిర్మాణం చేపట్టాలని ఎంపీపీ తాళ్ళపురెడ్డి వెంకటరాజరామ్‌ కలెక్టర్‌కు ఽఅర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రజల నుంచి కలెక్టర్‌,ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌,ఆర్డీవోలు వి.వి.రమణ, ఎస్‌.కె.ఆయిషా, డీఆర్వో శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, నాలుగు మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

పాలిథిన్‌ సంచుల వినియోగం తగ్గించాలి

మాడుగుల రూరల్‌: పాలిథిన్‌ సంచుల వినియోగం తగ్గించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. మాడుగులలో స్వచ్ఛరథం సిబ్బంది పాత సామగ్రికి కొత్త వస్తువులు ఇస్తున్న తీరును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి, పొడిచెత్తను వేరు చేసి, రిక్షాలో వేయాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమలో స్థానిక ఎమ్మెల్యే బంగారు బండారు సత్యనారాయణమూర్తి, ఎండీపీవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement