ఏయూలో స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఏయూలో స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షా కేంద్రాలను ఏయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఎన్‌.వి.ఎస్‌.చిట్టిబాబు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లోని ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించిన మౌలిక సౌకర్యాలు, నిబంధనల అమలు తీరును ఆయన పరిశీలించారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఏయూ పీజీ, ప్రొఫెషనల్‌ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ వై.అబ్బులు సైతం స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement