● ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి వినోద్‌బాబు
మాట్లాడుతున్న వినోద్‌బాబు
కె.కోటపాడు : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి మద్దిలి వినోద్‌బాబు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వడంతో పాటు పౌష్టిక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అంది స్తున్నట్టు చెప్పారు. అధ్యాపకులు తప్పనిసరిగా టీచింగ్ నోట్స్, డైరీని నిర్వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పైనా ప్రత్యేకశ్రద్ధ చూపి, వారి నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టాలని ఆయన సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగమణి పాల్గొన్నారు.


