● 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
కూలిపోయిన కల్వర్టు
నక్కపల్లి: మండలంలో గొడిచర్ల, కొత్తూరు గ్రామాల మధ్య గల కల్వర్టు శుక్రవారం కుప్పకూలిపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే గొడిచర్ల, కొత్తురు మధ్య ఆర్‌అండ్ బీరోడ్డులో గల కల్వర్టు భారీ వాహనాల రాకపోకల వల్ల కూలిపోయింది. దీంతో జాతీయరహదారి మీదుగా గొడిచర్ల, కొత్తూరు, డొంకాడ, ముకుందరాజుపేట, జగన్నాథపురం, చీడిక, దోసలపాడు, రేబాక, రమణయ్యపేట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు తమ గ్రామాలకు చేరుకోవాలంటే అదనంగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉద్డండపు రం మీదుగా వెళ్లాల్సి వస్తోందని ఆయా గ్రామా ల ప్రజలు వాపోతున్నారు.


