● డిప్యూటీ డీఈవో అప్పారావు
విద్యార్థులతో మాట్లాడుతున్న
డిప్యూటీ డీఈవో అప్పారావు
మాడుగుల: టెన్త్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డిప్యూటీ డీఈవో అప్పారావు ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల పరిషత్ బాలురు, బాలికల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి, బోధన ఎలా ఉంది, పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా ? లేదా ? మధ్యాహ్న భోజనం ఎలా ? ఉంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2025–26లో టెన్త్‌లో శత శాతం ఫలితాలు సాధించడంతో హెచ్‌ఎంలు, హిమబిందు, ముత్యాల నాయుడులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు ఈశ్వరరావు, దేముడమ్మ, ఎంఆర్‌సీ సిబ్బంది నాగేంద్ర, రాజు, సీఆర్పీలు పాల్గొన్నారు.


