నూకాంబిక సన్నిధిలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

నూకాంబిక సన్నిధిలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌

Jul 3 2026 12:40 AM | Updated on Jul 3 2026 12:40 AM

అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని గురువారం వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని కుటుంబ సమేతంగా నూతన ఆలయంలో దర్శించుకోవడం అభినందనీయమన్నారు. వీఎంఆర్‌డీఏ పరిధిలో పలు అభివృద్ధి కార్యాక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్‌ యాళ్ల శ్రీధర్‌, ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీనులు ప్రణవ్‌గోపాల్‌ను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కనకమహాలక్ష్మికిపంచామృతాభిషేకం

డాబాగార్డెన్స్‌: బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి దేవస్థానంలో గురువారం త్రికాల పంచామృతాభిషేకం జరిపారు. ఈ సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తులు రూ.1,000 పూజా రుసుం చెల్లించి పూజలో పాల్గొనవచ్చు. ఈ ప్రత్యేక పూజను పరోక్ష పద్ధతిలో చేసుకునే ఆసక్తి గల భక్తులు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, టౌన్‌ కొత్తరోడ్డు బ్రాంచ్‌, అకౌంట్‌ నంబర్‌ 060810011006691, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ యూబీఐఎన్‌0806081లో చెల్లించవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement