మహారాణిపేట: కేజీహెచ్‌లో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ యూనిట్‌ను మంజూరు చేసింది. మొత్తం రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. మొత్తం వ్యయంలో రూ.11 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టగా, రూ.9 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేశారు.


