నిరసన తెలిపిన దళితులు
నక్కపల్లి: మండలంలో చందనాడ దళిత కాలనీ చుట్టూ ఆర్సిలర్‌మిట్టల్ స్టీల్‌ప్లాంట్ వారు ఫెన్సింగ్ వేయడం సమంజసం కాదంటూ గురువారం పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఫెన్సింగ్ వేసే చోట నిరసన తెలిపారు. దళిత కాలనీ చుట్టూ ఉన్న భూములను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంతో యాజమాన్యం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. ఇలా చేయడం వల్ల దళితకాలనీలో నివసించేవారు రాకపోకలు సాగించే వీలుండదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు అన్నారు. దళిత కాలనీని ఖాళీ చేయించి అక్కడ నివసించేవారిలో 18 ఏళ్లు నిండినవారికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవేమీ చేయకుండా కాలనీ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రాకపోకలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేయడంతో పాటు, ఫెన్సింగ్ పనులు అడ్డుకుంటామన్నారు.


