అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

కశింకోట: మండలంలోని బయ్యవరం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కోటా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అనకాపల్లి పౌర సరఫరాల అధికారి లీలా గురువారం రాత్రి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా ఒక పాడుబడిన ఇంట్లో 9 బస్తాల బియ్యం పట్టుబడ్డాయన్నారు. వాటిని తూకం వేయగా 480 కిలోలు ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ఉగ్గినపాలెం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించామన్నారు. పేదలకు చెందాల్సిన ఉచిత బియ్యాన్ని కొనుగోలు చేయడం, అమ్మకాలు జరపడం, అక్రమ రవాణా జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement