ముద్రగడకు ధర్మశ్రీ పరామర్శ | - | Sakshi
Sakshi News home page

ముద్రగడకు ధర్మశ్రీ పరామర్శ

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

యలమంచిలి రూరల్‌: అస్వస్థతకు గురై హైదరాబాద్‌ సింధు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వకర్త కరణం ధర్మశ్రీ గురువారం పరామర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వెళ్లిన ఆయన ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ముద్రగడ గిరి, సింధు ఆస్పత్రి చైర్మన్‌ పార్థసారధిరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం కోలుకుని స్వగ్రామం కిర్లంపూడి వస్తారని ధర్మశ్రీ అన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement