ఇద్దరు యువతులను రక్షించిన లైఫ్‌గార్డ్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువతులను రక్షించిన లైఫ్‌గార్డ్స్‌

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో అలల ఉధృతికి కొట్టుకుపోతున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్‌గార్డ్స్‌ రక్షించారు. వివరాలు.. కొమ్మాదికి చెందిన సీహెచ్‌ దీప్తి, యామిని అనే ఇద్దరు యువతులు గురువారం మధ్యాహ్నం సరదాగా గడిపేందుకు బీచ్‌కు వచ్చారు. కాసేపటి తర్వాత స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు. అలల ఉధృతికి కొట్టుకుపోతున్న వీరిని అక్కడే విధులు నిర్వహిస్తున్న లైఫ్‌గార్డ్స్‌ గమనించారు. వెంటనే స్పందించి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మైరెన్‌ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని ఇంటికి పంపించారు. లైఫ్‌గార్డ్స్‌ను మైరెన్‌ సీఐ శ్రీనివాస్‌రావు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement