ఎమ్మెల్సీకి ఎస్‌జీటీల వినతి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీకి ఎస్‌జీటీల వినతి

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

నర్సీపట్నం: అల్లూరి జిల్లాలో శాశ్వత స్థానికతతో పని చేయాలనే నిబంధనను సడలించేలా చూడాలని ఎస్‌జీటీలు గురువారం నర్సీపట్నం విచ్చేసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడును కలిసి వినతిపత్రం అందజేసారు. మొదటి ప్రత్యామ్నాయంగా జోన్‌–1లో సెలెక్ట్‌ అయిన 2018–2025 ఉపాధ్యాయులను విభజనల్లో జోన్‌–2లో గల అల్లూరి జిల్లాకు బలవంతంగా పంపించడం జరిగిందని, విశాఖ, అనకాపల్లిలో జిల్లాలోనే ఉండేలా సర్దుబాటు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్సీ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఆర్‌టీయు జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement