పూసపాటిరేగ: భోగాపురం మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భోగాపురంలోని హనుమాన్ జంక్షన్ నుంచి ముక్కాం వైపు వెళ్తున్న డీజే సౌండ్ సిస్టం వ్యాన్‌పై టాప్‌లో కూర్చున్న ఇద్దరు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి టాప్, వ్యాన్ మధ్య ఇరుక్కుపోవడంతో విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జంగులూరు గ్రామానికి చెందిన దుల్లా లోకనాథంఅక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన లాలం పార్థసారథి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని విజయనగరం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట గ్రామానికి తరలించారు. ఈ మేరకు భోగాపురం ఎస్‌ఐ వి.పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరొకరికి గాయాలు


