న్యూస్‌రీల్
జిల్లాలో 80,163
‘బంగారు కుటుంబాలు’ గుర్తింపు
‘ఆడబిడ్డ నిధి’ పథకంలో
రూ.743.49 కోట్ల‘ కూటమి’ బాకీ
18–60 ఏళ్ల లోపు మహిళలకు
నెలకు రూ.1500 సాయం ఎగవేతేనా ?
పేదరిక నిర్మూలన పేరిట ’పీ4’ అంటూ రెండేళ్లుగా కాలయాపన
అధికారిక వెబ్‌సైట్లలో అంతా కాకి లెక్కలే.. క్షేత్రస్థాయిలో శూన్యం!
దక్కేనా?
ప్రత్యేక రైళ్లు మరికొంతకాలం పొడిగింపు
సకాలంలో పింఛన్ల పంపిణీ పూర్తి
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026
ఆడబిడ్డకు
నగదు అందజేస్తున్నకలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: సామాజిక పింఛన్ల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లి మండలం శంకరం ఎస్సీకాలనీలో బుధవారం ఆమె లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. అనంతరం పింఛన్ల పంపిణీపై ఆరా తీశారు. సక్రమంగా అందుతున్నదీ లేనిదీ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2,51,772 మంది లబ్ధిదారులకు రూ.106.85 కోట్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మున్సిపాలిటీ పరిధి, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభించామన్నారు. శతశాతం పెన్షన్లు పంపిణీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.ఆశాజ్యోతి, ఏపీడీ జి.డైసీ, పంచాయతీ సెక్రెటరీ సంతోషిని, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
సాక్షి, అనకాపల్లి : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇచ్చిన మూడు పథకాలు (తల్లికి వందనం, ఉచిత గ్యాస్ బండ, అన్నదాత సుఖీభవ) కూడా అరకొరగానే అమలు చేశారు. ముఖ్యంగా 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఇస్తామన్న ‘ఆడబిడ్డ నిధి’ హామీని ఇవ్వకుండా, దాన్ని ‘పీ4’ (ప్రజా భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన) కార్యక్రమానికి అనుసంధానం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాటు కాలయాపన చేస్తూ మహిళలను ఘోరంగా మోసం చేసింది. ఇప్పుడే కాదు..గత 2014–19 చంద్రబాబు పాలనలోనూ రైతులకు రుణమాఫీ, యువతకు నిరుద్యోగ భృతి, సున్నావడ్డీ, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను ఎగ్గొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా ‘సూపర్ సిక్స్’ హామీలన్నీ అమలు చేసేశామంటూ అబద్ధాలు చెబుతూ నాలుక మడతేస్తున్నారని, ఎన్నికల ముందు హామీలిచ్చి ఆ తర్వాత కాలయాపనతో మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు, బాధిత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెబ్‌సైట్లలో కాకి లెక్కలు మాత్రమే..
అధికారిక గణాంకాల ప్రకారం అనకాపల్లి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని 522 సచివాలయాల పరిధిలో మొత్తం 80,163 బంగారు కుటుంబాలను గుర్తించారు. ఇందులో 2,06,526 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు చూపిస్తున్నారు. వీరిని అడాప్ట్ చేసుకునేందుకు జిల్లాలో 6,420 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారని, ఇప్పటికే 47,597 కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారని, ఇంకా 32,571 కుటుంబాలను దత్తత చేసుకోవాల్సి ఉందని వెబ్‌సైట్‌లో కాకిలెక్కలు చూపిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఎవరు ఏ కుటుంబాన్ని దత్తత చేసుకున్నారనే వివరాలు సచివాలయాల వారీగా ఎక్కడా లేవు. దీనిపై సచివాలయ ఉద్యోగులను అడిగితే వెబ్‌సైట్‌లో చూసుకోవాలని తప్పించుకుంటున్నారు తప్ప స్పష్టత ఇవ్వడం లేదు.
ప్రభుత్వం బాకీ..
పీ4 సర్వే ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పేద మహిళలు జిల్లా వ్యాప్తంగా 2,06,526 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు (రెండేళ్లు) పూర్తయింది. ఈ లెక్కన ఒక్కో మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇవ్వాలి. అంటే జిల్లాలోని అర్హులైన మహిళలందరికీ కలిపి ఏడాదికి రూ.371.74 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ‘ఆడబిడ్డ నిధి’ పేరిట చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకు గానూ జిల్లా మహిళలకు మొత్తం రూ.743.49 కోట్ల రూపాయలు బాకీ పడింది.
తాటిచెట్లపాలెం(విశాఖ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖప ట్నం–షాలిమర్–విశాఖపట్నం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగించినట్లు సౌత్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వై.బాలాజీ కిరణ్ తెలిపారు. విశాఖపట్నం–షాలిమర్ (08508) ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం ఉదయం 11.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుస టి రోజు తెల్లవారుజామున 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ రైలును జూలై 28 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో షాలిమర్–విశాఖపట్నం (08507) ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు షాలిమర్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సేవను జూలై 29 వరకు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
అనకాపల్లి టౌన్: జాతీయ ఉపాధ్యాయ అవార్డులు–2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్య జోన్ ప్రాంతీయ సంచాలకుడు బి.విజయ భాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు నెల 10తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
‘పీ4’ పేరిట కాలయాపన
పేదరిక నిర్మూలన పేరిట తీసుకొచ్చిన ఈ పీ4 ప్రక్రియలో భాగంగా అధికారులు ఆరు నెలల పాటు సర్వే చేసి జిల్లాలో ’బంగారు కుటుంబాల’ను గుర్తిస్తూ ఏడాదిన్నర పాలనను గడిపేశారు. అయితే ఈ కుటుంబాలను గుర్తించారు కానీ, వారిని దత్తత (అడాప్ట్) చేసుకునేందుకు దాతలు ఎక్కడా ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలోని మొత్తం 24 ప్రభుత్వ శాఖల అధికారులపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దాతలను వెతికి పట్టుకునే బాధ్యత అధికారులదే అనడంతో, వారు తమ విధులను పక్కనబెట్టి దాతల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపులు నడిపేవారిని, చిన్నా చితకా వ్యాపారస్తులను బలవంతంగా దత్తత తీసుకోమంటూ ఒత్తిడి తెచ్చినా ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆరు నెలల పాటు హడావుడి చేసిన పీ4 కార్యక్రమాన్ని ఇప్పుడు పూర్తిగా అటకెక్కించేశారు.


