భూ వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

భూ వసూళ్లు

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

న్యూస్‌రీల్‌

అనకాపల్లి
కూటమి నేతల
అంబేరుపురం వీఆర్‌వో సస్పెన్షన్‌
కలెక్టర్‌ ఎన్‌వోసీ ఇచ్చినా.. ఎమ్మెల్యేల అడ్డుపుల్ల ఎమ్మెల్యేల నుంచీ ఎన్‌వోసీ తీసుకోవాల్సిందే సిట్‌లో ఉన్న భూములనూ క్లియర్‌ చేయించుకున్న లాబీయిస్ట్‌ తహసీల్దార్‌ నుంచి మాత్రం లభించని గ్రీన్‌సిగ్నల్‌ ఎకరాకు ఇంత అని ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిందే..

7

బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికై న జిల్లా జట్టు సభ్యులు

అనకాపల్లి టౌన్‌: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 11, 12 తేదీలలో జరిగే రాష్ట్ర స్ధాయి సీనియర్‌ సీ్త్ర, పురుషుల పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో స్థానిక ఎస్‌.కె.పి జిమ్‌ విద్యార్థులు పాల్గొంటున్నట్టు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడ్రపు నీలా ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరిలలో జిమ్‌ సభ్యులు తొమ్మిది మంది క్రీడాకారులతో జిల్లా జట్టు ఎంపిక జరిగిందని, వీరందరూ ఈ పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

కలెక్టర్‌ ఆదేశాలిచ్చినా...!

సాధారణంగా ఏదైనా ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా... గతంలో మిలిటరీలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి భూమి కేటాయించినా... ఇటువంటి భూమిని 22–ఏ జాబితాలో చేరుస్తారు. అంటే ఇది ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో పేర్కొంటారు. దీనిని ఈ జాబితా నుంచి తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. 22–ఏ జాబితా నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ నిరంభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌–ఎన్‌వోసీ) ఆదేశాలు జారీచేసిన తర్వాత... ఆటోమేటిక్‌గా ఈ భూమి ప్రైవేటు భూమిగా మారిపోతుంది. సదరు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు మారిపోతుంటాయి. అంతేకాకుండా తాము ఎవరికి విక్రయించాలని భావిస్తే.. వారి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసే వెసులుబాటు సదరు హక్కులు పొందిన ప్రైవేటు వ్యక్తులకు ఉంటుంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం కలెక్టర్‌ ఆదేశాలిచ్చినప్పటికీ సదరు భూములపై మాత్రం తిరిగి స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా అటు అనకాపల్లి జిల్లాలో ఏకంగా సిట్‌ జాబితాలో ఉన్నాయని విమర్శలు ఎదుర్కొన్న 12 ఎకరాల భూమిని 22–ఏ జాబితా నుంచి ఒక లాబీయిస్ట్‌ ప్రైవేటు వ్యక్తుల పేరుతో మార్పించేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా అమరావతి నుంచే కథ నడిపించినట్టు తెలుస్తోంది. అయితే, స్థానికంగా మాత్రం తహశీల్దార్లు సదరు ప్రైవేటు వ్యక్తి పేరుతో మార్పులు చేసేందుకు ససేమిరా అంటున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

మ్మడి విశాఖ జిల్లాలో కూటమి ప్రజా ప్రతినిధులు బరితెగించి మరీ వసూళ్లకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఏకంగా అమరావతి నుంచి కథ నడిపించి, వందల కోట్ల విలువైన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తీసివేయించుకుని, ప్రైవేటు భూములుగా మార్చుకుని... కలెక్టర్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు మాత్రం అడ్డుపుల్ల వేస్తున్నారు. తమ నుంచి ఎన్‌వోసీ తీసుకుంటేనే భూ విక్రయాలు సాఫీగా సాగుతాయని బెదిరింపులకు దిగుతున్నారు. ఒకవేళ తమ మాట కాదంటే... సదరు భూమి వ్యవహారం తేల్చాలంటూ లేఖలు విడుదల చేస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఏకంగా చినబాబు నుంచి వ్యవహారం నడిపించి రెవెన్యూ రికార్డుల్లో తప్పులున్నా, సిట్‌ జాబితాలో భూములున్నా అన్నీ చక్కబెట్టుకుని వందల కోట్ల విలువైన భూమి వ్యవహారాలు చేసిన వారికి స్థానిక ప్రజా ప్రతినిధులు మాత్రం చుక్కలు చూపెడుతున్నారు.

ఒకవేళ కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ జారీ అయినప్పటికీ... తమను కలిసేదాకా రికార్డుల్లో మార్పులు చేయవద్దంటూ తమ ఆశీస్సులతో వచ్చిన తహశీల్దార్లకు స్థానిక కూటమి ప్రజా ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఒక్కసారి స్థానిక ప్రజా ప్రతినిధిని కలిసిన తర్వాతే తమ వద్దకు రావాలంటూ తహశీల్దార్లు తెగేసి చెబుతున్నారు. ఫలితంగా సదరు లాబీయిస్టులు కాస్తా ప్రజా ప్రతినిధులను కలిస్తే... ఎకరాకు ఇంత మొత్తం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విశాఖలోని 5 ఎకరాల భూమి విషయంలో అన్నీ ఫార్మాలిటీస్‌ పూర్తి కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, అనకాపల్లి జిల్లాలోని 12 ఎకరాల విషయంలో విక్రయించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ వ్యవహారం ముందుకు సాగకపోవడంతో, స్థానిక ప్రజా ప్రతినిధికి ఎకరాకు ఇంత మొత్తం అప్పగించేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. మొత్తంగా స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఎన్‌వోసీ లేకపోతే ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ వ్యవహారాలు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో సదరు భూ వ్యవహారంలో విచారణ జరిపించాలంటూ వెంటనే లేఖలు విడుదల అవుతున్నాయనే విమర్శలున్నాయి.

వేగవంతంగా ఇంటింటి ‘సర్‌’వే

అధినేతతో వైఎస్సార్‌సీపీ నేతల భేటీ

చోడవరం : ఉన్నతాధికారులపై దురుసుగా ప్రవర్తించిన అంబేరుపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో)ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన చోడవరం తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్‌పై సమీక్ష సమావేశంలో వీఆర్‌వో గూనూరు కనకలక్ష్మి అక్కడ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ సుబ్బలక్ష్మి, చోడవరం తహాసీల్దార్‌ రామారావు, ఎంపీడీఓ రాజుతో పాటు బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన అధికారులు, వీఆర్‌ఓలు ఉన్నారు. ఆ సమయంలో అంబేరుపురం వీఆర్‌ఓ కనకలక్ష్మిని డిప్యూటీ కలెక్టర్‌ వివరాలు అడుగుతుండగా ఆమె సహనం కోల్పోయి చేతిలో ఉన్న ఫైల్‌ను అధికారులపైకి విసిరేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. విధుల్లో ఉంటూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దురుసుగా ప్రవర్తించిన కనకలక్ష్మిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం ఆమైపె చర్యలు తీసుకొని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్టు తహసీల్దార్‌ రామారావు చెప్పారు. ఆమె స్థానంలో వెంకన్నపాలెం వీఆర్‌వోను ఇన్‌చార్జిగా నియమించినట్టు తెలిపారు.

పీజీటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆరిలోవ : ఉమ్మడి విశాఖ జిల్లాల్లోని హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌. ప్రేమకుమార్‌ తెలిపారు.పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 1 మధ్యాహ్నం ఒంటి గంటలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అంగీకార పత్రాలు సమర్పించాలని, గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగు–1, ఇంగ్లిష్‌–2, గణితం–3, భౌతికశాస్త్రం–1, వృక్షశాస్త్రం–2, జంతుశాస్త్రం–4 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

లాబీయిస్ట్‌కే చుక్కలు...!

వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు విశాఖ, అటు అనకాపల్లి జిల్లాలోనూ ఈ విధంగా 22–ఏ జాబితాలో ఉన్న భూములను ఈ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇటు విశాఖలోని కీలకమైన ప్రాంతంలోని 5 ఎకరాలతో పాటు అటు అనకాపల్లిలోని ఒక పారిశ్రామిక ప్రాంతంలోని 12 ఎకరాల భూములను ఇద్దరు లాబీయిస్టులు 22–ఏ జాబితా నుంచి తొలగించేలా చక్రం తిప్పారు. విశాఖలోని భూమి విషయంలో రెవెన్యూ రికార్డుల్లో తేడాలు ఉన్నాయి. ఇక అనకాపల్లిలోని భూముల విషయంలో సిట్‌ జాబితాలో ఉన్నట్టు విమర్శలున్నాయి. ఈ రెండు భూములను బీచ్‌ రోడ్డులో ఒకే అపార్టుమెంటులో ఉండే ఇద్దరు వ్యక్తులు క్లియర్‌ చేయించుకున్నారు. కలెక్టర్ల నుంచి ఎన్‌వోసీ వచ్చిన తర్వాత కూడా స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి మాత్రం ఎన్‌వోసీ రావడం లేదని తెలుస్తోంది. ఇక విశాఖలోని భూమి విషయంలో ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధికి అనుకున్న స్థాయిలో రొక్కం ముట్టడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక అనకాపల్లిలోని భూమి విషయంలో మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధిని కలిసిన తర్వాతే తన వద్దకు రావాలంటూ తహసీల్దార్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు కూడా అధికారులు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఈ భూములను విక్రయించేందుకు కూడా ఇప్పటికే డీల్స్‌ సిద్ధం చేసుకున్న సదరు లాబీయిస్టుకు ప్రజా ప్రతినిధి నుంచి ‘తన వాటా పరిస్థితి ఏమిటి?’ అంటూ ప్రశ్నలు రావడంతో బిక్కచిక్కిపోయాడు. ఏకంగా చినబాబు స్థాయి నుంచి వ్యవహారం నడిపినప్పటికీ స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకోకపోతే పనులు కావని గ్రహించిన సదరు లాబీయిస్టు ఎకరాకు ఇంత మొత్తం అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement