నాకు ఏడాది వయసులోనే అమ్మ చనిపోయారు. నాన్న దివ్యాంగుడు కావడం వల్ల.. నన్ను పోషించలేక హైదరాబాద్‌లోని ఎస్‌ఓఎస్ అనాథ శరణాలయంలో చేర్పించారు. అప్పటి నుంచి నా ఆలనా పాలనా అంతా శరణాలయమే చూసుకుంది. ఉన్నత విద్యకు కావాల్సిన మొత్తం సహకారం అందించారు. నేను అనాథలా అయ్యానే తప్ప.. నా ఆశయం కాదని నిరూపించేందుకే పట్టుదలతో చదివాను. గ్రాడ్యుయేషన్, ఎంబీఏ ఇక్కడే పూర్తి చేశాను. ప్రస్తుతం జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను.
– జొన్నలగడ్డ దివ్య,
గోల్డ్‌మెడల్ విద్యార్థిని, హైదరాబాద్


