మా అమ్మ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో వార్డెన్‌గా ఉన్నారు. నాన్న అడ్వకేట్. 2020–25 బ్యాచ్‌లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను. మొట్టమొదట వర్సిటీ చూస్తే.. కాస్త ఆందోళనగా అనిపించినా.. క్రమంగా రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఫ్యాకల్టీ ఎంతో బాగా సహకరించి.. మమ్మల్ని ఇంతటి వాళ్లని చేశారు. ప్రస్తుతం కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేస్తున్నాను. భవిష్యత్తులో పరిశోధకురాలినవ్వాలన్నది నా ఆకాంక్ష. – ఉమ్మిడి ఇషిత,
గోల్డ్‌మెడల్ విద్యార్థిని,
విశాఖపట్నం


