● ఆర్డీవో వి.వి.రమణ
మాట్లాడుతున్న ఆర్‌డీవో రమణ
నర్సీపట్నం : సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీవో వి.వి.రమణ పేర్కొన్నారు. ఎలక్షన్ డీ టీ, సర్ సూపర్‌వైజర్లతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అధికారి విధులు నిర్వహించాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేసిన తరువాత తిరిగి తీసుకోవడంలో తీవ్రజాప్యం ఏర్పడుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీఆర్వోలు,బీఎల్వోలు పరస్పర సమన్వయంతో పని చేసి, గడువులోపు సర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నా రు. పోలింగ్ కేంద్రాల వివరాలు, భౌగోళిక సరిహద్దులు, ఇంటి నంబర్లు, ఓటర్ల డేటా వంటి అంశాల్లో పారదర్శకత ఉండాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రామారావు పాల్గొన్నారు.


