రైల్వే భద్రతపై జీఎం సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రైల్వే భద్రతపై జీఎం సమీక్ష

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

తాటిచెట్లపాలెం: పని ప్రదేశాల్లో భద్రత, ఆస్తుల నష్ట నివారణ, రైళ్ల సమయపాలనపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మంగళవారం జీఎం కార్యాలయంలో జోనల్‌ పరిధిలోని నాలుగు డివిజన్‌ల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు, ఆస్తుల రక్షణ, రైళ్ల సమయపాలనపై అధికారులతో చర్చించారు. భద్రతకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement