మునగపాక : మండలంలోని తోటాడలో ఏర్పాటు చేసిన సురభి నాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ప్రదర్శించిన లవకుశ పౌరాణిక నాటకం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో శ్రీ భానోదయ సురభి నాట్యమండలి వారు ప్రదర్శించిన ఈ నాటకం ఆహుతులను అలరించింది. నాటకంలోని నటీ నటులతో పాటు సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. నాటకాన్ని తిలకించేందుకు కళాభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా నాటకాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా స్థానిక కళాకారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొడ్డేడ రాజగోపాల్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వండర్ కిడ్స్ అధినేత మల్ల రామనాయుడు, మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్, దాడి వీరమహలక్ష్మినాయుడు, దొడ్డి కోటేశ్వరరావు, ఆళ్ల మహేశ్వరరావు, దొడ్డి రమేష్, పొలమరశెట్టి ఆనందరావు, సుందరపు కనకప్పారావు,ఆళ్ల వీరునాయుడు, రాపేటి పరమేష్, ఆడారి జగన్నాధరావు, దాడి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా సురభి నాటకోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన బుధవారం రాత్రి 9గంటలకు మాయాబజార్ పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.


