సీవీఏపీ యూనిట్‌ను సందర్శించిన సీపీవో | - | Sakshi
Sakshi News home page

సీవీఏపీ యూనిట్‌ను సందర్శించిన సీపీవో

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

నక్కపల్లి: మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పీ4 కార్యాలయాన్ని జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి జి. రామారావు మంగళవారం సందర్శించారు. ఇక్కడ కానిస్టెన్సీ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ (సీవీఏపీ)యూనిట్‌లో నిర్వహిస్తున్న అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు సమీకరిస్తున్నారనే విషయాలను ఆరా తీశారు. యంగ్‌ ప్రొఫెషనల్‌ మోరంపూడి జయరామ్‌ జీరో పావర్టీ కార్యక్రమాలు, బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శుల భాగస్వామ్యం, అవసరాల గుర్తింపు, అవసరాల పరిష్కార చర్యలు, క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాల గురించి సీపీవోకు వివరించారు. పీ4 కార్యక్రమాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతిరావు, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement