నక్కపల్లి: వేంపాడు టోల్‌ఫీజును ఎగ్గొట్టడంతోపాటు, సామర్థ్యానికి మంచి లోడుతో అడ్డదారిలో వెళ్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని ఆర్టీవోకు అప్పగించడంతో రెండు లారీలకు రూ.1.60 లక్షల పెనాల్టీ విధించారు. సీఐ జే మురళి తెలిపిన వివరాల ప్రకారం.. సామర్థ్యానికి మించిన లోడు టోల్ ప్లాజా ఫీజును ఎగ్గొట్టేందుకు రెండు లారీలు వేంపాడు, కాగిత మీదుగా అడ్డదారిలో రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆర్టీవోకు చర్యలు నిమిత్తం సిఫార్సు చేయగా, ఒక లారీకి రూ.74 వేలు, మరో లారీకి రూ.86 వేలు పెనాల్టీ విధించారన్నారు.


