పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్‌

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

రోలుగుంట : గంజాయి కేసు నమోదై నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కొర్రా ప్రసాద్‌ను గాలించి పట్టుకుని అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ పి.రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పెదబయిల గ్రామానికి చెందిన కొర్రా ప్రసాద్‌ రోలుగుంట పోలీస్‌ స్టేషన్‌లో 155/2022 గంజాయి కేసులో 4.ఎ నిందితుడుగా ఉండి నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు అతనిని గాలించి పట్టుకొని అరెస్ట్‌ చేసి, కోర్టుకు హాజరుపరిచి, జైలుకు తరలించడం జరిగిందని ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement